📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవాసవి నగర్‌లో ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం

వాసవి నగర్‌లో ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం

📰 Generate e-Paper Clip

వాసవి నగర్‌లో ఘనంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం

జోగిపేట, సెప్టెంబర్ 22: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

జోగిపేట పట్టణంలోని వాసవి నగర్‌లో వాసవి టీం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి అలాగే గణనాధుని దర్శించుకుని కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామ గౌడ్, మాజీ ఏఎంసి చైర్మన్ డి.బి. నాగభూషణం, వాసవి నగర్ అధ్యక్షుడు రాజశేఖర్ కులకర్ణి, బి ఆర్ ఎస్ నాయకులు చాపల వెంకటేశం, బిర్ల శంకర్, మాచర్ల విజయ్ కుమార్, పి. రఘునాథ్, శంకర్ రావుతో పాటు వాసవి టీం సభ్యులు దేవర్ శెట్టి సందీప్, వినీత్ తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి కల్యాణాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.