📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కావలి బృందావనo కాలనీలో ఉచిత వైద్య శిబిరం

కావలి బృందావనo కాలనీలో ఉచిత వైద్య శిబిరం

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి15)కావలిపట్టణం బృందావనం హౌసింగ్ కాలనీకల్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఆదివారం ఉదయం నుంచి జరిగిన ఈ శిబిరంలో ఒంగోలు ఉపాస్,కావలి లైఫ్ కేర్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా బిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ శ్రీరాం మాల్యాద్రి రిబ్బన్ కట్ చేసి,జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.ఉపాస్ హాస్పిటల్ డా.ప్రకాష్ చవల గారు బృందం నిర్వహించిన వైద్య శిబిరాన్ని కావలి పట్టణ ప్రజలు సద్వినియెగం చేసుకొన్నారు అని తెలిపారు.ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు బచ్చు వీరాస్వామి, వైద్యులు చవల ప్రకాష్,నళిని పద్మజ,సిహెచ్ ప్రసాద్,నల్లూరు రవికుమార్,మోడరన్ నరసింహారావు, వాసవి క్లబ్ మహిళా అధ్యక్షురాలు అనుమలశెట్టి కామాక్షి,వాసవి క్లబ్ సేవన్ లైయన్స్ అధ్యక్షులు సువర్ణ శ్రీను,వాసవి క్లబ్ జిల్లా డి ఓ పాదర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.