📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarఎన్నికల హామీని అమలు చేసిన సర్పంచ్ పీచు సత్యనారాయణ రెడ్డి ...

ఎన్నికల హామీని అమలు చేసిన సర్పంచ్ పీచు సత్యనారాయణ రెడ్డి ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ.5,116 అందజేస్తానని హామీ

📰 Generate e-Paper Clip

ఎన్నికల హామీని అమలు చేసిన సర్పంచ్ పీచు సత్యనారాయణ రెడ్డి

 

ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ.5,116 అందజేస్తానని హామీ

 

వధూవరులకు నగదు అందజేయడంతో గ్రామ ప్రజల హర్షం

 

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పీచుపల్లె గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ముందు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ పీచుపల్లె సర్పంచ్ పీచు సత్యనారాయణ రెడ్డి ఆడబిడ్డల వివాహాలకు సర్పంచ్ కానుక పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన వివాహ వేడుకలో లావణ్యరాజు కుమార్తె అంజలి – అనిల్ నూతన వధూవరులకు రూ.5,116 నగదును అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పీచు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు పలు హామీలు ఇచ్చానని, గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించారని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ.5,116 సర్పంచ్ కానుకగా అందజేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

సర్పంచ్ ఇచ్చిన హామీని అమలు చేస్తూ వధూవరులకు నగదు అందజేయడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దెంచనోజు సదానంద చారి, వార్డు సభ్యులు యాల్ల జనార్దన్ రెడ్డి, పీచు మౌనిక, మహంకాళి సౌజన్య, నాయకులు గడ్డం ఎల్లారెడ్డి, రఘపతి, సన్నీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.