📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఎండపల్లిలో తెలంగాణ క్రీడా పాఠశాలల ఎంపికలు

ఎండపల్లిలో తెలంగాణ క్రీడా పాఠశాలల ఎంపికలు

📰 Generate e-Paper Clip

తెలంగాణ క్రీడా పాఠశాలల ఎంపికలు

ఎండపల్లి మండల స్థాయి ఎంపిక పోటీలు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 16 (ప్రజావాణి):

తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం మండల స్థాయి ఎంపికలు ఈనెల 17, మంగళవారం రోజున నిర్వహించనున్నట్లు ఎండపల్లి మండల విద్యాధికారి (MEO) సముద్రాల హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎండపల్లి ప్రభుత్వ పాఠశాల వేదికగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎంపికకు వచ్చు అభ్యర్థులు సెప్టెంబర్ 2017 నుండి ఆగస్టు 31, 2018 మధ్య జన్మించి ఉండాలని. ఆన్‌లైన్‌లో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులని. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని వివరించారు. ఇందులో క్రీడాకారుల నైపుణ్యాన్ని అంచనా వేయడానికి పలు పరీక్షలు నిర్వహించనున్నారు. 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్ (వేగ పరీక్ష), 800 మీటర్ల పరుగు పందెం, నిలబడి పొడవు దూకడం (Standing Broad Jump), నిలువు దూకుడు (Vertical Jump), 6*10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వశ్యత పరీక్ష (Flexibility Test), ఎత్తు, బరువు కొలతలను నిర్వహిస్తారని, అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.