📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఎండపల్లిలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం

ఎండపల్లిలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఎండపల్లిలో ఉత్సాహంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

సర్పంచ్ మారం సునీత ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ, ముమ్మరంగా శ్రమదానం

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, మార్చి 06 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం శుక్రవారం రోజున అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ మారం సునీత – జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సర్పంచ్, ఇతర సిబ్బంది, గ్రామస్తులతో కలసి శ్రమదానం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రగతి ప్రణాళిక లక్ష్యాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఎంఈఓ, ఉప సర్పంచ్ దాసరి కళ్యాణి కొమరయ్య, వార్డు సభ్యులు బొంగాని మాధవి, ఇప్ప రాజేశం, సంపతి స్వామి, దేవి రవీందర్, దాసరి మల్లేశం, రేగుంట అంజి, సతీష్ గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో గ్రామస్తులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.