📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetఅంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి – రైతుకు భారీ నష్టం..

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి – రైతుకు భారీ నష్టం..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట జిల్లా, మార్చి 10, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండలం, అందె గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో కోళ్ల ఫారంలో భారీ నష్టం జరిగింది.అందె గ్రామానికి చెందిన రంగనబోయిన కుమార్, అనే రైతు నిర్వహిస్తున్న కోళ్ల ఫారం షెడ్లో పెంచుతున్న కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందాయి.సుమారు నెల రోజుల వయస్సు గల 8400 కోళ్లు చేతికొచ్చే దశలో ఉండగా సోమవారం రోజు నుండి తెలియని వ్యాధి సోకడంతో కోళ్లు కొట్టుకుంటూ ఒక్కొక్కటిగా చనిపోవడం ప్రారంభమైంది. దీంతో రైతు రంగనబోయిన కుమార్ తీవ్ర ఆవేదనకు గురై కన్నీటి పర్యంతమయ్యాడు. ఏదో అంతుచిక్కని వైరస్ సోకడంతోనే కోళ్లు మృతి చెందాయని, ఈ ఘటనలో సుమారు ₹20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు కుమార్ వాపోయాడు.తమకు భారీ నష్టం జరిగినందున,ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.