📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetఅంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ... కె. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. … కె. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు జిల్లా లోని మహిళలందరికీ జిల్లా పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సంధార్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మహిళలకు గౌరవం మరియు సమాన అవకాశాలు లభించే సమాజంలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నేటి తరం మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, క్రీడలు, రాజకీయ రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో మరింత మంది మహిళలు ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు సంకల్పంతో ముందుకు రావాలని ఆకాంక్షించారు.

మహిళల భద్రత మరియు రక్షణ విషయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అవసరమైనప్పుడు మహిళలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, వారి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

మహిళల భద్రత కోసం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామాల్లో షీ టీమ్, కళ జాత బృందం ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలు తమ హక్కులు, చట్టాలు మరియు భద్రతకు సంబంధించిన సేవలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ గారు సూచించారు. ప్రతి మహిళా తన హక్కులపై అవగాహన పెంపొందించుకుని ధైర్యంగా ముందుకు సాగుతూ తన లక్ష్యాలను సాధించాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.