📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

 

  • **రామగుండం పోలీస్ కమీషనరేట్**

    **పత్రిక ప్రకటన**
    తేదీ: 09-02-2026

    **కట్టుదిట్టమైన భద్రతల మధ్య స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు: పెద్దపల్లి డీసీపీ బి.ram

మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో పాటు అనంతర కార్యక్రమాలకు సంబంధించిన అవసర చర్యలు చేపట్టుతున్నామని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి తెలిపారు.

సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లు,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను డీసీపీ,గోదావరిఖని ఏసిపి ఎం.రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డీసీపీ అక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, మరింత పక్డబందీగా ఏర్పాటు చేయాలని సూచనలు అందించారు.బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్‌లతో పాటు,పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లో వాటి భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు,ఆర్మ్డ్ గార్డులు,సైన్ ఫ్లెక్సీలు, కౌంటింగ్ సమయంలో ఎవరికీ అనుమతి ఇవ్వాలి, తీసుకోవలసిన జాగ్రత్తలు,పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు.ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సిబ్బందికి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.