📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeక్రీడలురాష్ట్రస్థాయి ఆర్చరి క్రీడలను  ప్రారంభించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ 

రాష్ట్రస్థాయి ఆర్చరి క్రీడలను  ప్రారంభించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ 

📰 Generate e-Paper Clip

రాష్ట్రస్థాయి ఆర్చరి క్రీడలను

ప్రారంభించిన ఖమ్మం పోలీస్ కమిషనర్

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 

 

తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీఎం కప్ – 2025-2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ క్రీడ పోటీలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన 230 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ‘సీఎం కప్-2026’ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచి మంచి గుర్తింపు తీసుకురావాలనన్నారు. క్రీడల ద్వారా క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని, గెలుపు మాత్రమే లక్ష్యం కాకుండా పాల్గొనడం కూడా ముఖ్యమని తెలిపారు. ఓటమికి భయపడకుండా నిరంతరం ప్రయత్నం చేయాలని అన్నారు.

యువత, విద్యార్థులు ఇతర. అ సాంఘికకార్యకలాపాలకు దూరంగా ఉండి క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని, అదేవిదంగా గ్రామీణ క్రీడలను బలోపేతం చేయడం, గ్రామీణ స్థాయిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ క్రీడాలు ఉత్తమ చాంపియన్లను తయారు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొని కష్టపడి ఉత్తమ ప్రతిభ కనబరచాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి సునీల్ కుమార్ రెడ్డి, ఆర్చరీ జిల్లా ప్రెసిడెంట్ సారంగపాణి,కార్యదర్శి పుట్టా శంకరయ్య, ఓలంపిక్ అసోసియేషన్ భాద్యులు క్రిష్టఫర్ బాబు, వెంకటేశ్వర్లు, ఆఫీస్ మేనేజర్ ఉదయ్ కుమార్,

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రామారావు,ఆదర్శ్ కుమార్, రంజాన్, సైదేశ్, ముజాహీద్, నవీద్ పాషా డీఎస్ ఏ కోచెస్, డీఎస్ ఎ సిబ్బంది, అన్ని జిల్లాల కోచ్ లు, మేనేజర్లు, ఆర్చేరీ సెక్రటరీ లు ఇతర కోచెస్ ఆర్చరీ కోచ్ నరేష్,పాల్గొనగా, క్రీడాకారులకు మంచి వసతి తో పాటు భోజనాలు ఏర్పాటు చేశామని సునీల్ రెడ్డి తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.