EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKumuram Bheem Asifabadనరేంద్ర మోదీ ప్రభుత్వ సహాకారంతోనే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర...

నరేంద్ర మోదీ ప్రభుత్వ సహాకారంతోనే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్

📰 Generate e-Paper Clip

నరేంద్ర మోదీ ప్రభుత్వ సహాకారంతోనే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్

 

 

కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీయం క్రికెట్ గ్రౌండ్లో శనివారం రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచార నిమిత్తం ఏర్పాటుచేసిన విజయ సంకల్ప సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వమే మున్సిపాలిటీలకు నిధులు ఇస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రాష్ట్రం చేసిందేమీలేదని తెలిపారు. కేవలం గ్రామాల అభివృద్ధి కాకుండా పట్టణాల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించి యూ ఐ డి ఎఫ్, 15వ ఆర్థిక సంఘం అమృత్ పథకాల కింద కేంద్రం నిధులు కేటాయిస్తుందని తెలిపారు. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగు పరచడం కోసం పారిశుద్ధ్య నిర్వహణ కోసం భారీగా నిధులు కేటాయిస్తుందని తెలిపారుఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గేడం నాగేష్ మాట్లాడుతూ తాను రైల్వేస్టేషన్ అభివృద్ధి కోసం రూ.60 కోట్ల నిధులు తీసుకువచ్చానని, పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించామని, రైల్వే అండర్ బ్రిడ్జితో పాటు ఓవర్ బ్రిడ్జిలు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు

సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఒకసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని,తద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో గాని 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గాని పట్టణంలో ఒరిగింది ఏమీ లేదని పట్టణం మురికివాడ లాగా తయారైందని తెలిపారు.

ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేయాలని, అలాగే బెల్లంపల్లి నుండి గడ్చిరోలి వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు

అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ని శాలువాతో సత్కరించి మెమంటో అందజేశారు.ఈ విజయ సంకల్ప సభకు ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, భాజపా మాజీ జిల్లా అధ్యక్షులు డా.కొత్తపల్లి శ్రీనివాస్,మున్సిపల్ ఇంచార్జి భూమన్న, ఎస్టీ మూర్ఛ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట్నాక విజయ్, మాజీ జడ్పీటీసీ అరిగేలా నాగేశ్వర్ రావు, పీవీ రెడ్డి, సుహాసిని సిద్ధంశెట్టి, పట్టణ అధ్యక్షులు కుమార్, మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ కొండ్ర మనోహర్ గౌడ్,అన్ని వార్డుల భాజపా కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.