📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

త్యాగానికి ప్రతిరూపం మాత రమాబాయి అంబేద్కర్

ఘనంగా 128వ జయంతోత్సవ వేడుకలు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మారం ఫిబ్రవరి 07 (ప్రజావాణి):

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో శనివారం రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి 128 వ జయంతిని కరెన్సీ పై “అంబేద్కర్ ఫోటో సాధన సమితి” జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ… మాత రమాబాయి 1998 ఫిబ్రవరి 7న మహారాష్ట్రలోని దబోల్ గ్రామంలో జన్మించారని, ఆమె తండ్రి బికు దోత్రే వాళ్ళంకర్, తల్లి రుక్మిణి చిన్న వయసులోనే మరణించారని తెలిపారు, మాత రమాబాయి కి అంబేద్కర్ తో బాల్యంలోనే వివాహం జరిగిందని, ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విధేయత గల జీవిత భాగస్వామిగా ఆదర్శప్రాయంగా జీవించిందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఎంత ఎత్తుకు ఎదిగిన తన ఉన్నతిలో భాగం కాలేకపోయిందని చివరకు కష్టాల కడలిలో సాధారణ జీవితాన్ని గడిపి భర్త ఉన్నత విద్యకు ఆసరాగా నిలిచిన ఆ మహనీయురాలి జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు దాగేటి కొమురయ్య, ఏఎంసీ డైరెక్టర్ కాంపల్లి రాజేశం, అంబేద్కర్ అవార్డు గ్రహీత దేవి రాజలింగం, నాయకులు బొల్లి నందయ్య, మద్దునాల రాజమల్లు, సుంచు మల్లేశం, జేరిపోతుల నర్సయ్య, పాలకుర్తి లక్ష్మణ్ గౌడ్, బత్తిని సాగర్, ఐలేని శ్యామ్, మండిగం గోపీచంద్, బోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.