📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

టేక్మాల్ ఫిబ్రవరి 19: (మన ప్రజావాణి) టేక్మాల్ మండలం కుసంగి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ 396 వ, జయంతి సందర్భంగా మెదక్ జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ యూసుఫ్ శివాజీ యూత్ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో స్థానిక స్కూల్ వద్ద శివాజీ మహారాజ్ ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్కూల్ వద్ద నుండి భారీ ర్యాలీతో హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630 అయిన శివనేరి కొండ కోటలో జన్మించాడు ప్రముఖ మరాఠా యోధుడు మరియు పశ్చిమ భారతదేశంలో మరాఠ సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితకాలంలో మొగలులు,, బీజాపూర్ సుల్తానేట్,మరియు పోర్చుగీసులతో అనేక చారిత్రక యుద్ధాలు చేసి ముఖ్యంగా గేరెల్లా వ్యూహాలను (గెరిల్లా యుద్ధ తంత్రం) ఉపయోగించి ప్రతాప్ గడ్, కొల్హాపూర్, సింహగాడ్, మరియు సూరత్ వంటి కీలక పోరాటాలలో అద్భుతమైన విజయాలు సాధించి మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, శివాజీ యూత్ సభ్యులు,వినోద్ గౌడ్, ఎల్లయ్య,భాను ప్రకాష్ గౌడ్, రామకృష్ణారెడ్డి,విక్రం గౌడ్, దుర్గయ్య,చాకలి కృష్ణ, సురేష్,భూపాల్,సతీష్ గౌడ్, బాగారాజు,శంకర్,మధు, మల్లేశం,సతీష్,షరీఫ్, బుచ్చయ్య,శ్రీధర్ రెడ్డి, పోచయ్య,మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.