* పులపుత్తూరు అభివృద్ధి బాధ్యత కూటమిదే.మూడు నుండి నాలుగు నెలల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు
* అంబేద్కర్ జయంతి సందర్భంగా పులపత్తూరు వాసులకు చమర్తి భరోసా….
* తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు
రాజంపేట మండలం/ నియోజకవర్గ పార్టీ కార్యాలయం/రాజంపేట పట్టణం
గత వైసిపి పాలకుల ఇసుక దందా దురాశతో అన్నమయ్య డ్యామ్ తెగిపోయి చిన్నాభిన్నమైన పులపుత్తూరు గ్రామస్తుల గాయాలను మాన్పి అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాని దేనని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హామీ ఇచ్చారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జవాద్ తుఫాన్ సమయంలో గత వైసిపి పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య డ్యామ్ తెగిపోయి నిరాశ్రయులై పునరావాసానికి కూడా నోచుకోని కులపుటూరు గ్రామాన్ని చమర్తి జగన్ మోహన్ రాజు సందర్శించారు.అక్కడ గ్రామస్తులను పరామర్శించి వారి సాధక బాధలను తెలుసుకున్న ఆయన చలించిపోయారు.
ఈ సందర్భంగా చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి మూడు నెలల్లో పునరావవాసంతో పాటు కావలసిన మౌలిక వసతులు ఏర్పరుస్తామని హామీ ఇచ్చిన మాటలు నీటి మీద రాతలు అయ్యాన్నారు.
కాంట్రాక్టర్ వైఫల్యంతో ఉన్నారా వాస గృహాల నిర్మాణం అటకెక్కితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కో ఇంటికి లక్ష నుండి రూ 20 వేలు, రూ 60 వేలు దాకా అదనపు నిధులు విడుదల చేసినా కాంట్రాక్టర్ కారణంగా బాధితులు పునరావాసానికి నోచుకోక ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే జిల్లా కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ తో పాటు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని పులపత్తూరు గ్రామాన్ని సందర్శించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పునరావాస కేంద్రంలో వీధి దీపాలు ఏర్పాటుచేసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
అలాగే వేసవిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి వసతికి బోర్డు నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ముఖ్యంగా పులపుత్తూరు దళితువాడ ప్రజల ఆకాంక్ష మేరకు దేవాలయం నిర్మాణం తో పాటు కావలసిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు.
వారిని వరద ప్రభావిత గాయాల నుండి తేరుకొని అన్ని విధాల అభివృద్ధి దిశగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని బాధితులకు అండగా నిలబడతామని భరోసా కల్పించారు.అభివృద్ధి ఫలాలు అందరికీ సమంగా అందాలన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పులపుత్తూరు అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
