సేవలకు సలాం…5వ కమాండెంట్ కె. సుబ్రహ్మణ్యం గారికి ఘన వీడ్కోలు
ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)
ములుగు జిల్లా చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్ కమాండెంట్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం గారి పదవీ విరమణ సందర్భంగా బెటాలియన్ ఆవరణలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం గారికి బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఆకట్టుకునే వీడ్కోలు పరేడ్ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి, ఆయన పోలీసు శాఖకు అందించిన విశిష్ట సేవలను కొనియాడారు.
తన పదవీ కాలంలో బెటాలియన్‌లో క్రమశిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం, శిక్షణా ప్రమాణాల పెంపు మరియు ప్రజాసేవకు విశేష కృషి చేసి బెటాలియన్ అభివృద్ధికి విశేష సేవలందించారని అధికారులు పేర్కొన్నారు.
అనంతరం బెటాలియన్ అధికారులు, సిబ్బంది గ్రాండ్ సెండ్-ఆఫ్ నిర్వహించి భావోద్వేగపూర్వకంగా వీడ్కోలు పలికారు. పుష్పవర్షం మధ్య కమాండెంట్ శ్రీ కె. సుబ్రహ్మణ్యం గారిని ఘనంగా సాగనంపుతూ, ఆయన పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు అదనపు కమాండెంట్ సీతారాం సహాయ కమాండెంట్లు కృష్ణ ప్రసాద్, ధర్మారావు , ఆర్.ఐలు, కిరణ్, భాస్కర్, స్వామి,శ్రీధర్ సాయిబాబు,వెంకటేశ్వర్లు, మంత్రివర్గ సిబ్బంది, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బై రిపోర్టర్ గొల్లపెల్లి శ్రీకాంత్

