📄 ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguజంపన్నవాగులో గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు – జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్...

జంపన్నవాగులో గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు – జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ పరిశీలన

📰 Generate e-Paper Clip

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)

ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జంపన్నవాగులో ప్రమాదవశాత్తు గల్లంతైన వ్యక్తి కోసం పోలీసు, ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF) బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.బుధవారం జంపన్నవాగు ప్రధాన వంతెన నుంచి ఊరట్టం వంతెన మధ్య ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో నీటిలో ఈతకు దిగిన పీట్ల తిమ్మయ్య (45), తండ్రి రంగయ్య, వడ్డెర, వృత్తి: కారు డ్రైవర్, స్వస్థలం: కొండాపూర్ గ్రామం, ఘట్‌కేసర్ మండలం ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఆయన ఆచూకీ లభించలేదు.ఈ ఘటనపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, ఐపీఎస్ సంఘటన స్థలాన్ని సందర్శించి గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, పస్రా సీఐ దయాకర్ లతో కలిసి సంఘటన స్థలాన్ని ఎస్ పి గారు పరిశీలించారు.జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF)కు చెందిన ఇద్దరు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, 25 మంది శిక్షణ పొందిన నిపుణులైన సిబ్బంది ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయంగా జంపన్నవాగు మొత్తం పరిధిలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు, ముక్యంగా 9 కిలోమీటర్ల పరిధిలో ఇంచు ఇంచు గాలింపు చేసారు .ఇసుకమెటలలో చిక్కుకపోయి ఉండచ్చు అనే నేపథ్యంలో గాలింపు బృందం స్వయంగా వాగు లోకి దిగి పరిశీస్తున్నారు,ఏ క్షణమైనా మృతదేహం లభించే అవకాశం ఉన్నందున గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు మద్యం సేవించి నీటిలోకి దిగడం, వాగులు, నదుల్లో ఈత కొట్టడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

బై రిపోర్టర్‌ ప్రజావాణి గొల్లపెల్లి శ్రీకాంత్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular