గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమీషనరు గారు స్వయంగా తమ సెల్ఫ్ ఎన్యూమరేషన్ (Self-Enumeration) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నగర ప్రజలందరూ తమ సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా ప్రభుత్వానికి అవసరమైన ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని, భవిష్యత్ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇది ఎంతో ఉపయోగకరమని కమీషనర్ వివరించారు.అందువల్ల ప్రతి కుటుంబం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావడం అత్యంత అవసరమని సూచించారు.కమీషనర్ మాట్లాడుతూ, “Self-Enumeration ప్రక్రియను వినియోగించుకోవాలనుకునే వారు అధికారిక వెబ్ సైట్ https://se.census.gov.in/ ను సందర్శించి నమోదు చేసుకోనవచ్చని మరియు తరువాత ఒక ప్రత్యేక Self-Enumeration ID (SE – ID) జనరేట్ అవుతుంది. ఆ ID ను గణనాధికారి (Enumerator) మీ ఇంటిని సందర్శించినప్పుడు తెలియజేయవలెను. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ చాలా సులభం. ప్రతి కుటుంబం స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాలి. ఇంకా నమోదు చేయని వారు ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలి” అని తెలిపారు, ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రజలకు సౌకర్యవంతంగా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే Self-Enumeration (స్వీయ గణన) సదుపాయం 2026 ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు అందుబాటలో ఉంటుందని తద్వారా ప్రజలు ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం, సమయం ఆదా కావడంతో పాటు, ఖచ్చితమైన సమాచారం నమోదు చేయడం సులభమవుతుందని తెలిపారు.నగరపాలక సంస్థ అడిషనల్ కమీషనరు,డిప్యుటీ కమీషనరు, అసిస్టెంట్ కమీషనరు, సెక్రటరీ, శాఖాధిపతులు మరియు సిబ్బంది ఇప్పటికే తమ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేశారని కమీషనర్ పేర్కొన్నారు. అలాగే,సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చురుకుగా పనిచేస్తున్నారని తెలిపారు.ప్రజల సహకారంతోనే ఈ ప్రక్రియ విజయవంతమవుతుందని, ప్రతి కుటుంబం బాధ్యతగా భావించి సెల్ఫ్ ఎన్యూమరేషన్‌ను పూర్తి చేయాలని కమీషనర్ కోరారు.
Homeఆంధ్రప్రదేశ్సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన ఎంటీఎంసీ కమీషనర్ - ప్రజలు వెంటనే నమోదు పూర్తి చేయాలని...
సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన ఎంటీఎంసీ కమీషనర్ – ప్రజలు వెంటనే నమోదు పూర్తి చేయాలని విజ్ఞప్తి
0
11
RELATED ARTICLES
- Advertisment -




