కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 10) సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించండి
ఏఐటీయూస ఏరియా ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్.
ఈరోజు బద్వేల్ పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్ లో సివిల్ సప్లై వర్కర్స్ తో ఏఐటియుసి ఆధ్వర్యంలో కలిసి వాళ్లకి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఏరియా ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్, మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలోని కూలీ డబ్బులు సగం మాత్రమే చెల్లించి మార్చి నెల సంబంధించిన కూలి డబ్బులు నేటికీ చెల్లించ లేదని ప్రతి నెల మొదటి వారంలోనే కూలీ డబ్బులు పడేటట్లు చూడాలని విన్నవించిన అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని లోడింగ్ అన్లోడింగ్ పనులు మాత్రం ఒత్తిడి తెచ్చి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక సంవత్సరాలగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో అన్లోడింగ్ లారీల మామూళ్లు చెల్లిస్తూ వస్తున్నారని జిల్లాలో డిపార్ట్మెంటల్ గా స్టేజి-1 కాంట్రాక్టర్ అన్లోడింగ్ లారీల మామూళ్ళు రోజువారి చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తున్నారని అధికారులకు చెప్పిన తీరు మారడం లేదన్నారు.హమాలీలకు కూలి డబ్బులు పాత విధానం మాదిరిగా వారి వ్యక్తిగత అకౌంట్ యందు జమ అయ్యేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.రేషన్ డీలర్స్ బయోమెట్రిక్ పరిగణలోకి తీసుకోకుండా గోడౌన్ నుంచి సరుకులు రవాణా అన్లోడింగ్ అయిన వెంటనే కూలీ డబ్బులు పడేటట్లు చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బద్వేల్ పట్టణ అధ్యక్షులు జిఎల్ నరసింహ సివిల్ సప్లై యూనియన్ నాయకులు రమేష్ కార్మికులు నాగార్జున మల్లికార్జున శీను తదితరులు పాల్గొన్నారు,
సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించండి,, ఏఐటీయూసీ
RELATED ARTICLES

