📄 ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సిద్దిపేట పోలీస్ 'ఉద్యోగ మిత్ర': ఏప్రిల్ 25న మెగా జాబ్ మేళా-నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం -...

సిద్దిపేట పోలీస్ ‘ఉద్యోగ మిత్ర’: ఏప్రిల్ 25న మెగా జాబ్ మేళా-నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం – సమన్వయ కమిటీ సమావేశంలో తేదీ ఖరారు..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట మర్కుక్, ఏప్రిల్, 14, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న “సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర” మెగా జాబ్ మేళాకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఈ నెల,ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ప్రకటించారు.ఈ మేరకు నేడు మార్కూక్ పోలీస్ స్టేషన్ లో జాబ్ మేళా నిర్వహణపై వివిధ కంపెనీల ప్రతినిధులు మరియు సమన్వయకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు, కంపెనీల భాగస్వామ్యం మరియు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై చర్చించి తేదీని అధికారికంగా ఖరారు చేశారు. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన పలు ప్రముఖ సంస్థలు ఈ మేళాలో పాల్గొననున్నాయి, పోలీస్ శాఖ కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతగా నిరుద్యోగుల బాగు కోసం ఈ ఉద్యోగ మిత్ర కార్యక్రమాన్ని చేపట్టిందని, మొత్తంగా 120 పైగా కంపెనీలు , 1500 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిపి కోరారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular