గజ్వేల్, జూన్ 11, ప్రజావాణి
గజ్వేల్ మండలం బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు వల్లపు నరసింహులు చదువు పూర్తయ్యాక సర్టిఫికెట్లు ఇవ్వని కార్పోరేట్లు విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు గజ్వేల్ మండలం బీసీ అధ్యక్షులు మాట్లాడుతూ ఫీజులు చెల్లించలేదని నేపంతో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాయని అన్నారు కార్పొరేట్ కళాశాలలో లక్షలలో డొనేషన్లు తీసుకుంటూ పేదలకు విద్యను అందని ద్రాక్షగా మారాయని ఆరోపించారు బీటెక్ టాప్ కాలేజీలు 10 లక్షల నుంచి 30 లక్షల వరకు డొనేషన్లు తీసుకుంటున్నాయని ఆరోపించారు కార్పోరేట్ కళాశాలల దోపిడిని అరికట్టే అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు ఫీజు రియార్మెంట్స్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు డొనేషన్లతో దోపిడీకి పాల్పడిన బీటెక్ కళాశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదు చేసి పేదల కార్పోరేట్ విద్యా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల బీసీ అధ్యక్షులు వల్లపు నర్సింలు బలమైన శ్రీనివాస్ యాదవ్ సైలేంద్ర శ్రీనివాస్ యాదవ్, దేశెట్టి యాదగిరి వెంకటాచారి రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.




