షాబాద్ పోలీస్ స్టేషన్‌లో నీటి కొరతకు పరిష్కారం
– బోరు వేయించిన గుర్రాల విష్ణు వర్ధన్ రెడ్డి
– మరిన్ని సేవలు చేయడానికి సిద్ధం
– సమాజ సేవ నా లక్ష్యం
ఏ సమస్య ఉన్న వెంబడే స్పందిస్తా
షాబాద్, //జూన్ 19: ప్రజావాణి
షాబాద్ పోలీస్ స్టేషన్‌లో నెలకొన్న తాగునీటి సమస్యకు స్థానిక సామాజిక సేవకుడు గుర్రాల విష్ణు వర్ధన్ రెడ్డి పరిష్కారం చూపించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన స్వంత ఖర్చులతో బోరు తవ్వించి అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది గుర్రాల విష్ణు వర్ధన్ రెడ్డి సేవా భావాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించే పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.స్థానికులు కూడా ఈ చర్యను ప్రశంసిస్తూ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో గుర్రాల విష్ణు వర్ధన్ రెడ్డి ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. బోరు ద్వారా పోలీస్ స్టేషన్‌లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సి ఐ కాంతా రెడ్డి, ఎస్ ఐ సతీశ్, ఏ ఎస్ ఐ రామ్ లాల్, షాబాద్ సర్పంచ్ గుండాల అశోక్, ఉప సర్పంచ్ దండు రాహుల్, మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఈగ ప్రభాకర్ రెడ్డి,కుమ్మరి చెన్నయ్య, సబితా గోవర్ధన్ రెడ్డి, కో ఆపరేటివ్ డైరెక్టర్ చక్కటి దేవేందర్ రెడ్డి, బండ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





