షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ జాయింట్ డైరెక్టర్‌ తనిఖీ

** *డాక్టర్ విజయలక్ష్మి*షాద్‌నగర్ ప్రజావాణి ఆగస్టు 07: షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్* జయలక్ష్మి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని **ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ICTC)**ను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా ICTC ల్యాబ్‌లో గర్భిణులు, సాధారణ రోగులకు నిర్వహిస్తున్న హెచ్‌ఐవీ పరీక్షల విధానాన్ని పరిశీలించి, పరీక్షల నిర్వహణ, రిపోర్టుల నమోదు తదితర అంశాలపై ల్యాబ్ టెక్నీషియన్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల కోసం వచ్చే ప్రతి గర్భిణికి తప్పనిసరిగా హెచ్‌ఐవీ పరీక్ష...