
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) బద్వేల్ నియోజకవర్గము బి.కోడూరు మండలము మేకవారిపల్లి హరిజనవాడ గ్రామము నందు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఈ రోజున భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ పవిత్ర మహోత్సవానికి మేకవారి పల్లి హరిజనవాడ ఆలయ కమిటీ నిర్వాహకులు,గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు, బద్వేల్ నియోజకవర్గ YSRCP అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి, ముఖ్య నాయకులు, తదితరులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తిశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించడం జరిగినది.తదనంతరము YSRCP సీనియర్ నాయకులు,మాజీ ఉప మండలాద్యక్షులు శ్రీ సిద్దు బాల సుబ్బా రెడ్డి గారిని, మరియు శ్రీ పెద్దిరెడ్డి నరసింహ రెడ్డి ను మర్యాద పూర్వకమూగా కలవడం జరిగినది.ఈ కార్యక్రమములో YSRCP మండల నాయకులు శ్రీ బసిరెడ్డి దుగ్గిరెడ్డి, శ్రీ S.సిద్ధేశ్వర రెడ్డి, అధినేత శ్రీ పెద్దిరెడ్డి విజయనరసింహ రెడ్డి, శ్రీ సిద్దు వెంకట సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగినది

