శ్రీ శివశంకరి గోశాల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహణ

ఘట్కేసర్, జూలై 12: ఎంఎంసీ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని 6వ డివిజన్ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ శివశంకరి వేద పీఠంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శివశంకరి గోశాలను ఆదివారం వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణలు, పూజా కార్యక్రమాల నడుమ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ 6వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క...