📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarశ్రీస్వామిఅమ్మ వార్ల సేవలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (దేవదాయశాఖ)

శ్రీస్వామిఅమ్మ వార్ల సేవలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (దేవదాయశాఖ)

📰 Generate e-Paper Clip

  1. *శ్రీస్వామిఅమ్మ వార్ల సేవలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (దేవదాయశాఖ)

నంద్యాల జిల్లా శ్రీశైలం జూన్ 11( ప్రజావాణి )

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (దేవదాయశాఖ) శ్రీ సి.హెచ్.సీతారామాంజనేయప్రసాద్ ఈరోజు (11.06.2026) శ్రీశైలానికి విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సాయంకాలం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి కార్యనిర్వహణాధికారి శ్రీ యం.శ్రీనివాసరావు, అర్చక స్వాములు, ఆలయ అధికారులు సాదరముగా స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనాంతరము వీరికి వేదాశీర్వచనముతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటము అందజేయబడ్డాయి.

ఈ సందర్భముగా శ్రీ సి.హెచ్.సీతారామాంజేనేయ ప్రసాద్ వారు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి సంబంధించి మరియు ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పలు అంశాలను కార్యనిర్వహణాధికారి వారితో చర్చించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular