శ్రీస్వామిఅమ్మ వార్ల సేవలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (దేవదాయశాఖ)

*శ్రీస్వామిఅమ్మ వార్ల సేవలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (దేవదాయశాఖ) నంద్యాల జిల్లా శ్రీశైలం జూన్ 11( ప్రజావాణి ) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (దేవదాయశాఖ) శ్రీ సి.హెచ్.సీతారామాంజనేయప్రసాద్ ఈరోజు (11.06.2026) శ్రీశైలానికి విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సాయంకాలం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి కార్యనిర్వహణాధికారి శ్రీ యం.శ్రీనివాసరావు, అర్చక స్వాములు, ఆలయ అధికారులు సాదరముగా స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనాంతరము వీరికి వేదాశీర్వచనముతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటము అందజేయబడ్డాయి. ఈ సందర్భముగా శ్రీ సి.హెచ్.సీతారామాంజేనేయ...