నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) ఉదయగిరి మండలం లోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సామాజిక బాధ్యతను పెంపొందించుటయే సెన్సెస్ పోటీల యొక్క ముఖ్య లక్ష్యం శ్రీ.టి.వెంకటేశ్వర్లు,ఉదయగిరి మండల విద్యాశాఖధికారి,ఉదయగిరి మండలం లోని ఉన్నత పాఠశాలలో,పాఠశాల స్థాయిలో జనాభా గణన కంపిటేషన్స్ ద్వారా విద్యార్థులలో సామాజిక బాధ్యతను, డేటా విశ్లేషణ నైపుణ్యాన్ని అభివృద్ధి పరచవచ్చును అని,ఈ పోటీల ద్వారా విద్యార్థులను భావి బాధ్యతాయుత పౌరులు గా తీర్చిదిద్దడం లో సహాయ పడతాయి అని ఉదయగిరి మండల విద్యాశాఖాధికారి శ్రీ టి.వెంకటేశ్వర్లు తెలిపారు. అదేవిధంగా పాఠశాల స్థాయి పోటీలు నిర్వహించడం వల్ల”విద్యార్థులకు జనాభా గణన అంటే ఏమిటి అని అవగాహన కల్పించబడుతుంది. మరియు సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు నిజజీవిత అనువర్తనం,మరియు నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళిక,అనే అంశాల యందు ఆసక్తిని చూపుతూ జనాభా గణన ప్రక్రియల గురించి వారి ఇళ్లల్లో,సమాజంలో,విద్యార్థులు తెలియజేస్తారు. అందువలన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయగిరి మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందరి సమన్వయంతో, ట్రైనింగ్ టీచర్స్ సహకారంతో పూర్తి నిర్వహించడమైనది అని తెలిపారు.
“‘విద్యార్థుల సామాజిక బాధ్యతను పెంపొందించుటయే – సెన్సెస్ పోటీల యొక్క ముఖ్య లక్ష్యం
RELATED ARTICLES


