📄 ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialవిద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది

విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది

📰 Generate e-Paper Clip

*విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది*
విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది*

*బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్*



*అమ్మ ఆదర్శం యూత్ విద్యార్థులకు చేయూత*

* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 11

విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా అమ్మ ఆదర్శం యూత్ మంచిర్యాల ఆధ్వర్యంలో పట్టణంలోని ఒర్రెగడ్డ బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 200 మందికి పైగా విద్యార్థులకు 30 వేల రూపాయల విలువైన విద్యా కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాదని తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. సమాజంలో విద్యకు మించిన సంపద లేదని అన్నారు. అనంతరం మందమర్రి సీఐ పర్సా రమేష్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అమ్మ ఆదర్శం యూత్ వ్యవస్థాపకులు బండారి రవికుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడం, నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులోనూ విద్యా, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప పోలీసు అధికారులు నరేష్, శ్రీధర్, అమ్మ ఆదర్శం యూత్ సభ్యులు సాతిని సంజీవ్, సిద్దర్ల రాహుల్, విరుగురాల వినయ్, గంధం సంతోష్, గాదె మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular