📄 ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialమంత్రి వివేక్ పై అనవసరపు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి

మంత్రి వివేక్ పై అనవసరపు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

*మంత్రి వివేక్ పై అనవసరపు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి*

*పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ ఫలాలు*

*విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు తిరుమల్ రెడ్డి, నర్సింగ్ లు*

* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 11

కాంగ్రెస్ పార్టీపై, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పై బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని, వెంటనే వారు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణ ప్రెస్ క్లబ్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మంత్రి వివేక్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకే కేటాయించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించగా, బిఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన లిస్టు ప్రకారమే మొదటి విడతలో 250 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగిందని, మిగిలిన వాటి కేటాయింపు కొరకు 440 ప్రతిపాదిత జాబితాను ప్రదర్శించడం జరిగిందన్నారు. ఆ జాబితాలో ఏవైనా తప్పులను సవరించుకోవడం తో పాటు మార్పులు, చేర్పులు చేయడం కొరకే జాబితాను బహిరంగంగా ప్రదర్శించడం జరిగిందని వివరించారు. జాబితాలో తప్పు ఒప్పులను గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీపై, మంత్రి వివేక్ పై అసత్యపు ఆరోపణలు చేయడం తగదని సూచించారు. బిఆర్ఎస్ హయాంలో దళిత బంధు ఎంతమంది అర్హులకు ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం బిఆర్ఎస్ పార్టీ వారికే దళిత బంధు కేటాయించారని అదేవిధంగా బీసీ బందు, మైనార్టీ బంధు సైతం అర్హులైన వారికి కాకుండా కేవలం ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచించిన బిఆర్ఎస్ పార్టీ నేతలకే కేటాయించారు తప్ప ఏ ఒక్కటి బయటి వారికి కేటాయించ లేదని స్పష్టం చేశారు. కానీ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచన మేరకు సుమారు 50 శాతం మంది బిఆర్ఎస్ సానుభూతి పరులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాబితాలో అవకాశం లభించిందని, పార్టీలకు అతీతంగా ప్రజలకు అర్హులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, మంత్రి వివేక్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడితే, వాటి నిరూపిస్తే, వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయల నిధులతో చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి వివేక్ కృషి చేస్తున్నారని, ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపట్టుతున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ పేరిట ప్రజల మధ్య మంత్రి వివేక్ సంచరిస్తున్నారని, బాల్క సుమన్ ఈ విధంగా పర్యటించిన సందర్భాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. సర్ కేంద్ర ప్రభుత్వ ప్రక్రియ అని, దానిపై అనవసరపు ఆరోపాణలు చేయడం తగదని, పారదర్శకంగా సర్ ప్రక్రియ నిర్వహించేందుకు మంత్రి వివేక్ ఆదేశాలు జారీ చేశారని, బిఆర్ఎస్, బిజెపి నాయకులు అనవసరపు విమర్శలు మాని, ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. మంత్రి వివేక్ ఎలాంటి అవినీతి, అక్రమాలకు, భేషజాలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు కేటాయిస్తున్నారన్నారు. బిఆర్ఎస్ హయాంలో పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, ప్రతి పథకం బిఆర్ఎస్ నాయకులకే అందాయని విమర్శించారు. దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ నాయకులు కేవలం తమ ఉనికి కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్, మాజీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి పాషా, నాయకులు రాచర్ల గణేష్, వనం నర్సయ్య, మంకు రమేష్, చిప్పకుర్తి శశిధర్, సట్ల సంతోష్, రాయబారపు కిరణ్, మహిళా నాయకురాలు గడ్డం రజని, కవిత లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular