📄 ePaper
Friday, July 10, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarవార్త రాసిన జర్నలిస్టుకు బెదిరింపులుదొమ్మటి వెంకన్నపై పోలీసులకు ఫిర్యాదు

వార్త రాసిన జర్నలిస్టుకు బెదిరింపులుదొమ్మటి వెంకన్నపై పోలీసులకు ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

వార్త రాసిన జర్నలిస్టుకు బెదిరింపులుదొమ్మటి వెంకన్నపై పోలీసులకు ఫిర్యాదు

* వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు

* ప్రజా సమస్యలపై కథనం ప్రచురించడమే కారణమని ఆరోపణ

* ఆడియో రికార్డుతో వీణవంక పోలీసులను ఆశ్రయించిన జాతీయ భూమి ఎడిటర్ పంతాటి రవీందర్ ప్రజా జ్యోతి రిపోర్టర్ కొంగల కుమార్ యాదవ్

జమ్మికుంటవీణవంక జూలై 9 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లావీణవంక మండలంలోనిప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ వార్తలు ప్రచురించినందుకు తనను తీవ్రంగా బెదిరించారని ఆరోపిస్తూ జాతీయ భూమి తెలుగు దినపత్రిక ఎడిటర్ జర్నలిస్టు పంతాటి రవీందర్ వీణవంక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. వల్బభాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు శంకరయ్య, లక్ష్మి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేయగా వారి వాదన ఆధారంగా వార్త ప్రచురించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారుఫిర్యాదు వివరాల ప్రకారం వృద్ధ దంపతులకు ఇవ్వాల్సిన డబ్బులను ఇవ్వకుండా వారిని బెదిరిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న దొమ్మటి వెంకన్నపై వార్త ప్రచురించడంతో అతడు ఆగ్రహానికి గురయ్యాడని పేర్కొన్నారు. అనంతరం ఒక పాత్రికేయ మిత్రునికి ఫోన్ చేసినీ అంతు చూస్తానిన్ను వదిలిపెట్టను అంటూ తనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర హెచ్చరికలు చేశాడని రవీందర్ ఆరోపించారు ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డును సాక్ష్యంగా పోలీసులకు అందజేసినట్లు తెలిపారుప్రజా ప్రయోజనాల కోసం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా బాధ్యతల పరిధిలో వార్తలు ప్రచురించడం తన వృత్తి ధర్మమని, అలాంటి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టును బెదిరించడం చట్టవిరుద్ధమైన చర్య అని ఆయన పేర్కొన్నారు ఈ బెదిరింపుల కారణంగా తన వ్యక్తిగత భద్రతతో పాటు కుటుంబ సభ్యుల భద్రతపైనా ఆందోళన నెలకొన్నట్లు తెలిపారు
దొమ్మటి వెంకన్న వల్ల తనకు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అందుకు పూర్తి బాధ్యత అతనిదేనని ఫిర్యాదులో స్పష్టం చేశారు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)తో పాటు ఇతర సంబంధిత చట్టాల కింద దొమ్మటి వెంకన్నపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే తనకు, తన కుటుంబ సభ్యులకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని వీణవంక పోలీసులను కోరారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular