బెజ్జంకి, మే 2 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శనివారం సర్పంచ్ కవిత చేతుల మీదుగా వడ్లు తూకం వేయడం కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సందర్భంగా సర్పంచ్ కవిత మాట్లాడుతూ గ్రామ రైతులు అందరూ సమన్వయంతో కొనుగోలు కేంద్రానికి సహకరించాలని,వడ్లను తేమ శాతం తగ్గిన తర్వాత శుభ్రంగా సిద్ధం చేసి కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల వడ్లను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, ఎం.ఎస్. సారయ్య, సీఏలు పద్మ, లావణ్య, రైతులు శేఖర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సుధాకర్, రాయఫ్ రెడ్డి, శ్రీహరి, రాజిరెడ్డి, స్వప్న, అరుణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

