📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన హిందూ జర్నలిస్టు ఫోరం.

ర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన హిందూ జర్నలిస్టు ఫోరం.

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్:మార్చి12తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో భూ కబ్జాలపై వార్త కథనం రాసిన సీనియర్ జర్నలిస్టు ఉమాపతిపై జరిగిన దాడిని హిందూ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి పొన్నా రవికుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని ఆయన అన్నారు.పేరూరు పంచాయతీ పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై ఉమాపతి ఒక కథనం ప్రచురించగా, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఉమాపతికి చెవిలో రక్తస్రావం కావడంతో పాటు శరీరంపై గాయాలు కావడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషణలు చేసినట్లు వస్తున్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.ప్రస్తుతం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు ఉమాపతికి త్వరగా ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి పొన్నా రవికుమార్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular