ర్నలిస్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన హిందూ జర్నలిస్టు ఫోరం.
ప్రజావాణి న్యూస్:మార్చి12తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో భూ కబ్జాలపై వార్త కథనం రాసిన సీనియర్ జర్నలిస్టు ఉమాపతిపై జరిగిన దాడిని హిందూ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి పొన్నా రవికుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని ఆయన అన్నారు.పేరూరు పంచాయతీ పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై ఉమాపతి ఒక కథనం ప్రచురించగా, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు....