📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipet"రైతులకు సోలార్ విద్యుత్ పై అవగాహన" కేంద్ర ప్రభుత్వ సౌర శక్తి పథకం( PMKUSUM)పథకంతో అదనపు...

“రైతులకు సోలార్ విద్యుత్ పై అవగాహన” కేంద్ర ప్రభుత్వ సౌర శక్తి పథకం( PMKUSUM)పథకంతో అదనపు ఆదాయం పొందవచ్చు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,మే 7(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట రైతు వేదికలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న PMKUSUM పథకం ద్వారా రైతులు 7.5 కిలోవాట్ల వరకు సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ సహాయం అందుతుందని తెలిపారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.7.5 కిలోవాట్ల సోలార్ యూనిట్ ద్వారా 5 హెచ్‌పీ మోటార్‌ను రోజుకు సుమారు 10 గంటల వరకు వినియోగించుకోవచ్చని,అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించి నెలకు సుమారు రూ.2 వేల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో రైతులకు ముందస్తు అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తోటపల్లి ఏఈ అశోక్, బెజ్జంకి ఏఈ మహేష్, వ్యవసాయ అధికారి సంతోష్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular