“రైతులకు సోలార్ విద్యుత్ పై అవగాహన” కేంద్ర ప్రభుత్వ సౌర శక్తి పథకం( PMKUSUM)పథకంతో అదనపు ఆదాయం పొందవచ్చు

  బెజ్జంకి,మే 7(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట రైతు వేదికలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న PMKUSUM పథకం ద్వారా రైతులు 7.5 కిలోవాట్ల వరకు సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ సహాయం అందుతుందని తెలిపారు. ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.7.5 కిలోవాట్ల సోలార్ యూనిట్ ద్వారా 5 హెచ్‌పీ మోటార్‌ను రోజుకు...