రైతులకు అండగా కూటమి ప్రభుత్వం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా,ప్రజావాణి న్యూస్(ఏప్రిల్17) విజయవాడ రూరల్,కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం గారితో కలిసి,ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శుక్రవారం రైతులకు డివిడెండ్లు పంపిణీ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 287 మంది రైతులకు రూ.25,67,462లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు...