📄 ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఉద్యోగులను దగా చేసిన చంద్రబాబు - కాకాణి

ఉద్యోగులను దగా చేసిన చంద్రబాబు – కాకాణి

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా జూలై 12 ప్రజావాణి,వెంకటాచలం మండలం,చెముడుగుంటలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి కాకాణి కి ఘన స్వాగతం పలికిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్థులు,మహిళలు-మీరు మంత్రి గా,జగన్ మోహన్ రెడ్డి,ముఖ్య మంత్రి గా మాకు అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని,కూటమి పాలనలో మాకు ఏ పథకాలు సరిగా రావడం లేదని,కాకాణి ఎదుట వాపోయిన గ్రామస్థులు ఇటీవల వివాహం జరిగిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన మహిళా నాయకురాలు శ్రవంతి, తరుణ్ దంపతులను ఆశీర్వదించిన కాకాణి- 25 నెలలు గడిచినా ఉద్యోగులు,పెన్షనర్లకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు.-సీపీఎస్, జీపీఎస్‌పై సమీక్ష పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగులను మోసం చేసింది.-పీఆర్సీ కమీషన్ నియామకాన్ని ఆలస్యం చేసి ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసింది.-ఐఆర్ ప్రకటిస్తామన్న హామీ అమలు చేయకుండా ఉద్యోగులను నిరాశపరిచింది.-ఒకటో తేదీన జీతాలు,పెన్షన్లు చెల్లిస్తామన్న మాట నిలబెట్టుకోలేదు.- ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.-డీఏలు, పీఆర్సీ అరియర్లు,రటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. అవుట్‌సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.-వాలంటీర్లకు గౌరవ వేతనం పెంపు హామీని పూర్తిగా విస్మరించింది. ఆ వ్య‌వ‌స్థ‌నే లేకుండా చేశారు- అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు,

చిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.-ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ ఉద్యోగ భద్రతకు ముప్పు తెస్తోంది.-ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగ వ్యవస్థను బలహీనపరుస్తోంది.ఉద్యోగులు,పన్షనర్ల బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా-జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు DA లు సరిగ్గా వచ్చేవని అందరూ అనుకుంటున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఏ వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా సంతోషంగా లేరు.- చంద్రబాబు ​ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని చెప్పి, ఆ తర్వాత బీసీ, ఎస్సీ లకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగనామం పెట్టాడు- ​కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా.వృద్ధులు, వితంతువులు,దివ్యాంగులు,బీసీలు,ఎస్సీలు ఇలా అందరినీ ఈరోజు మోసం చేసిన పరిస్థితి నెలకొంది. ​జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్లను కూడా సరిగ్గా ఇవ్వకుండా,వాటికి కూడా కోత విధిస్తున్నారు-అన్ని వర్గాలను ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు మోసం చేశారో,ఉద్యోగులను కూడా అలాగే మోసం చేయడం అనేది అత్యంత దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్‌లో నిజమైన అభివృద్ధి,సంక్షేమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి.గతంలో నెల్లూరుకు కూత వేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను సేకరించి,కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు,ఇళ్లు మంజూరు చేశాం.ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదు,ఇళ్లు మంజూరు చేయడం లేదు, కట్టుకున్న ఇళ్లకు బిల్లులు కూడా చెల్లించడం లేదు.పెన్షన్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా,అభివృద్ధిని పట్టించుకోకుండా,చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆలోచన లేకుండా ‘సూపర్ సిక్స్’సూపర్ సెవెన్’ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చారా? ఆడబిడ్డలకు నెలకు ₹1500 ఇచ్చారా? నిరుద్యోగ భృతి ₹3000 ఇచ్చారా? ‘తల్లికి వందనం’ పథకం పూర్తిగా ఇస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు తనను తాను పొగుడుకుంటూ పరిపాలన బ్రహ్మాండంగా సాగిస్తున్నాననే భ్రమలో ఉన్నాడు”సర్”పేరుతో అర్హత కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే దుర్మార్గపు కుట్రలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నాడు గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా మట్టి రోడ్డు కనిపించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సిమెంట్ రోడ్లు నిర్మించాం ప్రస్తుత కూటమి ప్రభుత్వలో అభివృద్ధి శూన్యం,సంక్షేమం ఒక మోసం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తూ,పోలీసులను ఉసిగొల్పుతున్నారు.కూటమి నాయకులు వైకాపా సానుభూతిపరులు,సామాన్యులపై దౌర్జన్యాలు చేస్తూ వారి ఆస్తులను లాక్కుంటున్నారు.

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించడం లేదు. బాధితులే నిందితులుగా మారిపోయే పరిస్థితి ఉండటంతో ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికే భయపడుతున్నారు.చంద్రబాబు ఈ రెండు సంవత్సరాల పాలన తీరును ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు.చంద్రబాబు మాటలు చెప్పడం తప్ప, చేతల్లో అభివృద్ధి చేయడని ప్రజలకు బాగా అర్థమైంది ప్రశ్నిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పలాయనం చిత్తగించి భుజాలకు ఆపరేషన్ చేయించుకుని తిరుగుతున్నాడు.చంద్రబాబుని, ఆయన కొడుకును రెండూ భుజాలపై మోసి మోసి, ఇప్పుడు చంద్రబాబునిమోసిన ఒక భుజానికి ఆపరేషన్ చేయించుకున్నాడు.భవిష్యత్తులో లోకేష్ ను మోసిన మరో భుజానికి కూడా ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రకరకాల చౌకబారు విధానాలతో ఏదో ఒక రకంగా అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు,ప్రజల రక్షణ,వారి సంక్షేమం గురించి ఆలోచించడం లేదు.ప్రజలకు అభివృద్ధి,సంక్షేమం అమలు చేయాలనే లక్ష్యం తో పనిచేయకుండా మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దుర్మార్గం ఏ రోజు ఎన్నికలు వచ్చినా కూటమి నాయకులకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు.గతంలో చంద్రబాబు 2014 నుండి 2019 వరకు ఏ విధంగా పాలించారోఇప్పుడు అంతకన్నా దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి.  2019లో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పి ప్రజలు ఏ విధంగా అయితే జగన్ మోహన్ రెడ్డి పక్షాన నిలబడ్డారో,రాబోయే 2029 ఎన్నికల్లో అంతకన్నా తీవ్రంగా ఆయన పక్షాన నిలబడాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు,రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే, ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి వస్తుందిజగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారు.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రస్తుతం జరుగుతున్న అరాచకాలు,అక్రమాలు,అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుంది.తప్పు చేసిన వారిపై చట్టప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు.ప్రతి ఒక్క కుటుంబానికి అండగా నిలుస్తూ,అందరికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు లాగా కక్ష,కార్పణ్యాలతో గ్రామాలను తగలబెట్టి, ప్రజల మధ్య చిచ్చులు పెట్టే పరిస్థితులు భవిష్యత్తులో ఉండవు జిల్లా ప్రజలతో మమేకమవుతూ అన్ని వర్గాలకు అండగా నిలుస్తాం తప్ప అధికారం ఉంటేనే ప్రజలలో లేకపోతే పలాయనం చిత్తగించే అలవాటు మాది కాదు అని తెలియచేస్తున్నాం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular