ఘట్కేసర్, జూన్ 20: లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్ మండల పరిధిలోని పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నానావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, మాజీ ఉప సర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నర్సింహా, వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, బర్ల అనిత, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నానావత్ శివాజీ నాయక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


