రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలతో ఆత్మీయంగా మమేకమైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
రాయచోటి(ప్రజావాణి జూన్ 27) వైఎస్సార్‌సీపీ కార్యాలయం శనివారం పార్టీ శ్రేణులతో కళకళలాడింది. ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కార్యాలయానికి విచ్చేసిన ప్రజలు,కార్యకర్తలు,నాయకులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎంపీ మిథున్ రెడ్డి పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.స్థానిక సమస్యలు,ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై నాయకులు,కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు.ప్రజా సేవే...