ఎండపల్లి మండలం రాజారాంపల్లి వద్ద లారీ ఢీకొని చర్లపల్లికి చెందిన పత్తిపాక, మీస మునిలత (34) మృతి చెందింది. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఆమె రోడ్డు దాటుతుండగా, జగిత్యాల నుండి వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ మదాసు కొమురయ్య అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మరణించింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాజారాంపల్లిలో లారీ ఢీకొని మహిళ మృతి
0
7
RELATED ARTICLES




