ఏలూరు జూలై 03 ప్రజావాణి జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక జంగారెడ్డిగూడెం బీసీ హాస్టల్ విద్యార్థుల అవస్థలు.ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు వీడియో ద్వారా విజ్ఞప్తి చేసిన విద్యార్దులు.పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ ను పంపి పరిస్థితి తెలుసుకున్న ఎంపీ. విద్యార్ధుల ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ,ధన్యవాదాలు తెలిపిన విద్యార్దులు.పాఠశాలలో చదువుతూ సమీపంలోని బీసీ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులు హాస్టల్ నుంచి తమ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో మెసేజ్ ద్వారా గురువారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే స్పందించిన ఎంపీ జంగారెడ్డిగూడెం పట్టణ టిడిపి అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ కి ఫోన్ చేసి మాట్లాడి,హాస్టల్ కి వెళ్ళి విద్యార్థుల సమస్యను పరిశీలించి రావలసిందిగా ఆదేశించారు.కొండ్రెడ్డి కిషోర్ వెంటనే పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటితొ కలిసి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమీషనర్ కె వెంకట రమణ,ఎమ్మార్వో జోజి,ఇతర అధికారులను వెంటబెట్టుకుని శుక్రవారం ఉదయం బీసీ హాస్టల్ కు వెళ్ళి హాస్టల్ నుంచి స్కూల్ కి వెళ్లే దారిని పరిశీలించారు.
బీసీ హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి వారు స్కూల్ కి వెళ్లే దారిని అధికారులతో కలిసి పూర్తిగా పరిశీలించడం జరిగింది.హాస్టల్ నుంచి స్కూలుకి వెళ్లేందుకు ఉన్న మట్టిదారి వర్షాలు పడినప్పుడు బురదమయంగా మారి,అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా కష్టంగా మారిన దృశ్యాలను,అక్కడి పరిస్థితిని కొండ్రెడ్డి కిషోర్ బృందం ఎంపీకి ఫోన్లో వివరించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా ముందుగా గ్రావెల్ తోలించి తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయిస్తానని,హాస్టల్ విద్యార్థులు స్కూలుకు వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాటు చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ సందర్భంగా విద్యార్ధులకు హామీ ఇచ్చారు.సమస్యను తెలిచేయగానే వేగంగా స్పందించి హామీ ఇచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు,తమ సమస్యను ఎంపీకి వివరించి పరిష్కారానికి కృషి చేసిన పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ కి, కోనేటి చంటికి, బీసీ హాస్టల్ వార్డెన్ మరియు విద్యార్దులు కృతజ్ఞతలు తెలిపారు.
రహదారి అవస్థలపై బీసీ హాస్టల్ విద్యార్థుల వినతి..స్పందించి హామీ ఇచ్చిన.. ఎంపీ.
RELATED ARTICLES




