యువ సంగ్రామ సదస్సు విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు
పటాన్చెరు, జూలై 15 (ప్రజావాణి): ఈ నెల 18న హైదరాబాద్లోని సరూర్నగర్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి యువతను అధిక సంఖ్యలో సమీకరించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని జీఎంఆర్ కన్వెన్షన్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో యువ సంగ్రామ సదస్సు ఏర్పాట్లతో పాటు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై సమగ్రంగా చర్చించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి ఇంటింటి సర్వేను బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో పటాన్చెరు కోఆర్డినేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




