📄 ePaper
Saturday, May 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్యువత మేలుకో..తస్మాత్ జాగ్రత్త..ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.

యువత మేలుకో..తస్మాత్ జాగ్రత్త..ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.

📰 Generate e-Paper Clip

ప్రజావాణి నందిగామ ప్రాంతంలో పలుచోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని యువత బహిరంగంగా చెప్పుకుంటున్నారు.ఓ యువత ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న కొందరు ప్రైవేటు వ్యక్తులు,నాయకులు మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని నిరుద్యోగిగా ఉన్న యువతను ఆకట్టుకొని మోసం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త.తమ తల్లిదండ్రులు కాయ కష్టం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చమట చిందించి మిమ్మల్ని ప్రైవేట్ పాఠశాలలో,కాలేజీలలో చదివించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంతో కష్టం చేస్తున్నారు కానీ మీరు ఇటువంటి మోసాల పట్ల అవగాహన లేకపోవడంతో కొందరు యువతి యువకులు బలైపోతున్నారు.మీరు బలైంది కాకుండా తల్లిదండ్రులను కూడా బలి చేస్తున్నారు. మోసాలు చేస్తున్న వ్యక్తులు నిరుద్యోగి యువతను ఆసరా చేసుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తామని మాకు వాళ్లు తెలుసు వీళ్ళు తెలుసు నాయకులు తెలుసు అని పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు వాళ్ళను నమ్మి మీరు డబ్బులు ఇచ్చారా అంతే సంగతులు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసి చేసి అలసిపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఎవరికీ చెప్పుకోలేక లో లోపలే కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత.సమాజంలో ఇటువంటి ఉద్యోగాలు కు డబ్బులు కట్టి అవి తిరిగి రాక ఉద్యోగం రాక ఎందరో యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.తమ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని ఓ బ్రమా లో పడి లక్షలు లక్షలు డబ్బులు వడ్డీ కి తెచ్చి వడ్డీలు కట్టుకుంటూ అప్పుల ఊబిలో పడిపోతున్నారు.ఇప్పటికైనా మేల్కొని తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను నిరాశలు చేయకుండా జాగ్రత్తగా ఉండి చదువుని నమ్ముకొని ఉద్యోగాలు తెచ్చుకోండి. కలాన్ని నమ్ముకోండి ఉద్యోగాన్ని సంపాదించండి… లేదా ఉద్యోగం వచ్చే అవకాశం లేదు అంటే మంచి వ్యాపారం వైపు దృష్టి పెట్టండి అంతేకానీ ఈటువంటి నరరూప రాక్షసుల చేతిలో బలి అవ్వకండి.యువత తస్మాత్ జాగ్రత్త

RELATED ARTICLES
- Advertisment -

Most Popular