📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriకేబీఆర్ క్రిస్పీ చికెన్ 46వ బ్రాంచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి

కేబీఆర్ క్రిస్పీ చికెన్ 46వ బ్రాంచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 27: ఘట్‌కేసర్ మండల పరిధిలో కేబీఆర్ క్రిస్పీ చికెన్ 46వ బ్రాంచ్‌ను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్‌ను ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆహార సేవలు అందించాలని ఆకాంక్షించారు.

కేబీఆర్ క్రిస్పీ చికెన్ వ్యవస్థాపకులు నాగ ప్రభాకర్, నిర్వాహకులు శ్రవణ్, మనోజ్ గౌడ్ అతిథులను ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. వ్యాపార విస్తరణలో భాగంగా 46వ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, వినియోగదారులకు ఉత్తమ నాణ్యతతో కూడిన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, కొత్త రవి గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, పోచారం వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, మాజీ కౌన్సిలర్ చందుపట్ల వెంకట్ రెడ్డి, బండారి ఆంజనేయులు, ఎస్.కే. జంగీర్, సామల సందీప్ రెడ్డి, బద్దం జగన్మోహన్ రెడ్డి, మరం లక్ష్మారెడ్డి, మెరుగు నరేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, అన్ను భయ్, పల్లె విజయ్, ఖలీల్, షకీల్, సిరాజ్ , నిర్వాహకుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొని నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.

oplus_4194304
RELATED ARTICLES
- Advertisment -

Most Popular