జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్, జూన్ 14 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గంటల ప్రాతిపదికన (Hourly Basis) బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ (FAC) కె సందీప్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఖాలీగా ఉన్న పోస్టుల వివరాలు
టి.జి.టి (TGT) ఇంగ్లీష్: 01
పి.జి.టి (PGT) ఇంగ్లీష్: 02
పి.జి.టి (PGT) బోటనీ: 01
టి.జి.టి (TGT) మ్యాథ్స్: 01
పి.జి.టి (PGT) మ్యాథ్స్: 01
టి.జి.టి (TGT) సైన్స్: 01
విద్యా అర్హతలు: పి.జి.టి పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ (పీజీ) తో పాటు బి.ఎడ్ (B.Ed) ఉత్తీర్ణులై ఉండాలి.
టి.జి.టి పోస్టులకు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బి.ఎడ్, టెట్ (TET) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 16, 2026 సాయంత్రం 4 గంటల లోపు కుమ్మరిపల్లిలోని మోడల్ స్కూల్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 17 న డెమో నిర్వహించి, దాని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతామని ప్రిన్సిపాల్ పత్రికా ముఖంగా పేర్కొన్నారు.


