ముప్పాళ్ళ గ్రామంలో నల్ల బొగ్గు వ్యాపారం జోరుగా సాగుతున్న వైనం…? ప్రజల్లో ఆందోళన
గ్రామ శివారులో భారీగా నిల్వ చేసిన నల్ల బొగ్గు.!!పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉందని ఆందోళన.!!!అనుమతులతోనే వ్యాపారం జరుగుతుంది..!!!స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ తోనే చేస్తున్నాను ఫోన్లో బెదిరింపులు.. ముప్పాళ్ల, జూన్ 22 ప్రజావాణి చందర్లపాడు మండలంలోని ఓ గ్రామ శివారులో భారీ మొత్తంలో నల్ల బొగ్గు నిల్వలు కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.గ్రామానికి సమీపంలో పెద్ద పెద్ద కుప్పలుగా బొగ్గును నిల్వ చేయడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలంలో బొగ్గు నిల్వల నుంచి వెలువడే ధూళి,కలుషిత నీరు పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపే...