📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
HomeతెలంగాణKarimnagarముఖ్యమంత్రిమంత్రులుఇంచార్జ్ వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన

ముఖ్యమంత్రిమంత్రులుఇంచార్జ్ వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన

📰 Generate e-Paper Clip

ముఖ్యమంత్రిమంత్రులుఇంచార్జ్ వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన

*  ఇల్లందకుంట మండల కాంగ్రెస్ నాయకులు

– భవన నిర్మాణానికి ప్రణవ్ కృషి

– మంత్రుల దృష్టికి తీసుకెళ్లి,ఈ విషయంపై చర్చించిన ప్రణవ్

* పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్వంసం తప్ప అభివృద్ధి లేదు

జమ్మికుంట జూన్ 28 (ప్రజావాణి)

ఇల్లందకుంట మండల కేంద్రంలో నూతన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి కృషి చేసిన హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఇల్లందకుంట మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు నాయకులు..ఆదివారం రోజున ఇల్లందకుంట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు భట్టి విక్రమార్క,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,డిసిసి అధ్యక్షుడు సత్యం,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో పదేళ్లలో విద్వంసం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ పునఃనిర్మాణానికి కృషి చేస్తుందని అన్నారు.జిల్లాల పునర్విభజన,మండల పునర్విభజన తర్వాత కనీసం నూతన కార్యాలయాలకు నిధులు మంజూరు చేయించలేదనిఇక్కడ ఎమ్మెల్సీ,విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి ఈ రోడ్ వెంబడి పలు మార్లు వెళ్లగా ఒక్కసారి కూడా నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు మంజూరుకి జీవో జారీ చేస్తే అది తాను చేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సిగ్గు చేటని అన్నారు.ఆప్పుడైనాఇప్పుడైనా,ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే హుజురాబాద్ అభివృద్ధికి కృషి చేస్తుందని నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న ప్రణవ్ బాబు ఈ నియోజకవర్గానికి తన వంతు కృషి చేస్తూ నిత్యం  మంత్రులతో మాట్లాడి నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular