ఘట్‌కేసర్, ఏప్రిల్ 22 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్య వైశ్య ఫంక్షన్ హాల్‌లో మినర్వా హైస్కూల్ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా ఈ వేడుకను వైభవంగా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ అతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి పాల్గొని విద్యతోనే భవిష్యత్తు బలపడుతుందని పేర్కొన్నారు.
పాఠశాల డైరెక్టర్ డా. వెల్పుల రవికుమార్ యాదవ్, ప్రిన్సిపాల్ వెల్పుల అనూరాధ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం సజావుగా కొనసాగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు వెల్పుల సూర్య ప్రకాష్ యాదవ్, వెల్పుల చంద్ర ప్రకాష్ యాదవ్ వేడుకల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా సినిమా, టీవీ ఆర్టిస్ట్ సంజీవ్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్లి పావని జంగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఘట్‌కేసర్ అధ్యక్షుడు ఎం. ముత్యాలు యాదవ్, కౌన్సిలర్ కడప మల్లేష్, కౌన్సిలర్ శశికళ దేవేందర్, లయన్స్ క్లబ్ ఘట్‌కేసర్ అధ్యక్షుడు సారా శ్రీనివాస్ గౌడ్, లయన్స్ క్లబ్ మేడిపల్లి అధ్యక్షుడు కేశవ్ నాడం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అతిథులందరి సమక్షంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవం విజయవంతంగా ముగిసింది అని మినర్వా హై స్కూల్ యాజమాన్యం తెలిపారు.





