మినర్వా హై స్కూల్ వార్షికోత్సవం లో పాల్గొన్న వజ్రష్ యాదవ్

ఘట్‌కేసర్, ఏప్రిల్ 22 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్య వైశ్య ఫంక్షన్ హాల్‌లో మినర్వా హైస్కూల్ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా ఈ వేడుకను వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ అతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి పాల్గొని విద్యతోనే భవిష్యత్తు బలపడుతుందని పేర్కొన్నారు....