*మార్కెట్ రుసుము వసులను రద్దు చేసిన వనపర్తి మున్సిపల్ కౌన్సిల్*
*పట్టణంలోని చిన్న సన్న వ్యాపారస్తులకు అండగా ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి*
*ఇకపై వనపర్తిలో థై బజార్ రద్దు*
మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా :
మార్కెట్ రుసుము వసూలను రద్దు చేస్తున్నట్లు ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది వనపర్తి మున్సిపల్ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని మున్సిపల్ సర్వసభ సమావేశాల కీలక అంశాలు గురించి ప్రస్తావన తీసుకువచ్చి పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక, పన్నులు, వార్షిక బడ్జెట్, ఇందిరమ్మ ఇండ్లు, విద్యుత్ సంబంధ సమస్యలు, వంటి కీలకమైన పట్టణ నిర్వహణ అంశాలపై చర్చించారు వనపర్తి పట్టణ అభివృద్ధి పైన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు వనపర్తి పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లు అధికారులు అందరు కట్టుబడి పని చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


