కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) మహిళలు,పిల్లలపై ఎవరైనా శారీరక,లైంగిక దాడులకు పాల్పడినట్లయితే కుల,మత,రాజకీయాలకు అతీతంగా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాo.ప్రొద్దుటూరు.మహిళలు,పిల్లలు పై లైంగిక,శారీరిక దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.CI.కొండారెడ్డి.ప్రొద్దుటూరు ఒకటో పట్టణ సిఐ.గౌరవనీయులు కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మరియు ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీ విభుకృష్ణ,పర్యవేక్షణలో ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం నందు అంగన్వాడీ టీచర్స్,సచివాలయ సిబ్బంది,డ్వాక్రా మహిళలు,మహిళా సంరక్షణ కార్యదర్శులు,మహిళా శక్తి టీం మరియు మహిళలకు-మహిళలు,పిల్లలపై జరుగుతున్న దాడులకు సంబంధించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ వరదరాజుల రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని తన అపారమైన అనుభవంతో మహిళలకు సంబంధించిన విషయాలను గురించి తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ రవిచంద్ర రెడ్డి,మెప్మా.మహాలక్ష్మి మరియు ఎస్సై శ్రీనివాసులు మధుసూదన్ రెడ్డి,స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది
మహిళలు పిల్లలు పై జరుగుతున్న దాడులపై ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసుల అవగాహన సదస్సు
0
7


